Thursday, 5 November 2026

గాపడ్డ తెలంగాణను ఒడ్డున పడేసిన కెసిఆర్‌

ఇంటింటికి దసంక్షేమ పథకాలు అందచేసిన ఘనత

మరోమారు ఆశీర్వదించి గెలపించండి: చారి

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరవాత చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, వర్గానికి అందాయని మాజీకేంద్రమంత్రి,ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలచారి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని అన్నారు. ప్రజలు గత ప్రభుత్వాల పనితీరును, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరును పోల్చుకుని చూస్తున్నారని అన్నారు. అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరాయని, మహిళలు, వృద్ధులు, యువకులు సీఎం కేసీఆర్‌కు తమ ఆశీర్వచనాలు తెలియజేస్తున్నారని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే చూశామంటున్నారన్నారు. దగాపడ్డ తెలంగాణను కేసీఆర్‌ నాలుగేండ్లలోనే బాగు చేశారన్నారు.

ప్రజలను వంచించిన ప్రభుత్వాలు కావాలా.. ప్రజలు గౌరవంగా బతికేలా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. చిత్తశుద్ధిలేని ఆకర్షణీయమైన పథకాల పేర్లు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు మహాకూటమి నాయకులు వస్తారని, అధికారంలో ఉన్నపుడు

పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించాలన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యేలా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు గతంలో రూ.200, రూ.500 ఉంటే వాటిని కేసీఆర్‌ రూ.1000, రూ.1500కు పెంచారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఆడబిడ్డల పెండ్లి ఇంట్లో సంతోషాన్ని నింపుతున్నాయన్నారు. కేసీఆర్‌ కిట్లను అందజేసి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచామన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల నగదు, మాతా శిశు సంరక్షణ వస్తువులు అందజేస్తున్న సర్కారు ఎక్కడా లేదన్నారు. పుట్టిన బిడ్డ మొదలుకొని కాటికి వేళ్లే వృద్ధుడి వరకూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం బాధ్యతగా పని చేసిందని చెప్పారు. పేద బిడ్డలు చదువుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఇంగ్లిష్‌ విూడియం చదువులు చెబుతున్నారన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించే వారి కోసం ఆర్థిక సాయం చేస్తోందన్నారు. 68 సంవత్సరాలు కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీల పాలన చూశామని, అప్పటి పాలనకు ఇప్పటి ప్రభుత్వ పనితీరుకు పోలికే లేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.