Thursday, 5 November 2026

గాయం మానడానికి.. మరో 45రోజులు పడుతుంది


– జగన్‌ నొప్పితో బాధపడుతున్నారు
– పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయోటిక్స్‌ ఇస్తున్నాం
– సిటీ న్యూరో వైద్యులు
హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ప్రతిపక్షనేత జగన్‌ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉందని, గాయం పూర్తిస్థాయిలో మానడానికి మరో 45రోజులు పడుతుందని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం లోటస్‌ పాండ్‌ లోని జగన్‌ నివాసంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌, డాక్టర్‌ సాంబశివారెడ్డి, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ మధు విూడియాతో మాట్లాడారు. జగన్‌ ను పొడిచిన కత్తికి ఎలాంటి విషం లేదని వెల్లడించారు. ప్రస్తుతం గాయం నుంచి జగన్‌ కోలుకుంటున్నారని చెప్పారు. చేతిని కదిలించేటప్పుడు జగన్‌ నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
నొప్పి ఇంకా తగ్గకపోవడంతో జగన్‌కు యాంటీ బయోటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ ఇస్తున్నట్లు డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌ తెలిపారు. త్వరలోనే మళ్లీ ఆయన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో చేతికి ఎక్కువ శ్రమ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. చర్మంపై వేసిన కుట్లు సాధారణంగా వారంలోనే మానిపోతాయనీ, అయితే కండరాలకు వేసిన కుట్లు మానడానికి మరికొంత సమయం పడుతున్నారు. జగన్‌ విషయంలో గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పట్టే అవకాశముందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వెళతానన్న కోణంలోనే జగన్‌ మాట్లాడారని తెలిపారు. వచ్చే శుక్రవారం నుంచి జగన్‌ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఇటీవల జగన్‌ హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖ వినాశ్రయంలో వేచిఉండగా ఓ వ్యక్తి సెల్పీ దిగుతానని వచ్చి జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన విషయం విధితమే. అప్పటి నుండి జగన్‌ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో చికిత్స పొందుతున్నాడు. కాగా కత్తి బలంగా కుచ్చడంతో తీవ్రగాయమైందని వైద్యులు తెలిపిన విషయం విధితమే