Monday, 16 November 2026

గాలి జనార్ధనరెడ్డిని కాసేపట్లో బళ్లారి జైలుకు తరలింపు

బెంగుళూరు: గాలి జనార్దనరెడ్డిని కాసేపట్లో బళ్లారి జైలుకు తరలించనున్నారు. 2006లోతోరణగల్లు పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఓబుళాపురం కార్పోరేషన్‌నుంచి కర్ణాటక మైనింగ్‌ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడి తవ్వకాలు సాగించినట్టు ఆయనపై కేసు నమోదైంది. తపాల గణేష్‌, నారాయణరెడ్డిలను గాలి జనార్దనరెడ్డి బెదిరించినట్టు తొరణగల్లు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ మేరకు ఆయనను శుక్రవారం సండూరు న్యాయస్థానంలో సీబీఐ అధికారులు హాజరుపరచనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *