Wednesday, 4 November 2026

గాలి బెయిలు కేసులో సెప్టెంబరు 6వ తేది వరకు పొడిగింపు

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిలు మంజూరు వ్వవహారంలో అరెస్టయిన నిందితుల రిమాండ్‌ను సెప్టెంబరు 6వ తేదీ వరకు పొడిగిస్తూ శుక్రవారం ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం జ్యూడిషియల్‌ రిమాండ్‌ గడువు ముగిసి పోవడంతో జైలు అధికారులు నిందితులైన సస్పెన్షన్‌కు గురైన జడ్జి టి. పట్టాభిరామారావు, ఆయన కుమారుడు టి. రవిచంద్ర, మాజీ జడ్జి టి.వి.చలపతిరావు, రౌడీషీటర్‌ యాదగిరిరావు, కర్ణాటక ఎమ్మెల్యేలు సోమశేఖర్‌రెడి&, టి.హెచ్‌.సురేష్‌బాబు, గాలి బంధువు దశరధరామిరెడ్డి జూనియర్‌ న్యాయవాది ఆదిత్యలను కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *