Thursday, 5 November 2026

గిరిజన హక్కుల కోసం పోరాడతాం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(( జ‌నంసాక్షి)): గిరజన హక్కుల కోసం ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఇకముందు కూడా గట్టిగా పోరాడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంఘం తాత్కాలిక కమిటీని వేశారు. తుర్పు జిల్లా కన్వీనర్‌గా కోట్నాక విజయ్‌ని, కో కన్వీనర్‌గా మెర్‌పేలా సదాశివ్‌, సలహా దారుడిగా కోవ దేవ్‌రావును నియమించారు. త్వరలో అసిఫాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసి జిల్లా కమిటీతోపాటు, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.  గిరిజనుల్లోని 35 తెగల సామాజిక, సాపేక్ష న్యాయం కోసం పోరాడాతామని  కన్వీనర్‌ విజయ్‌ అన్నారు. తుడుందెబ్బ  ఆవిర్భవం నుండి ఆదివాసిల హక్కుల కోసం పోరాడుతుందన్నారు, 1/70, పీసా, అటవీ హక్కుల చట్టం, రాజ్యంగంలోని 5, 6 షెడ్యుల్‌లను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వీటి సంరక్షణ కోసం తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. సంఘం బలోపేతం చేస్తూ ఆదివాసీ హక్కుల కోసం పోరాడతామన్నారు. ఇదిలావుంటే జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2015-16 విద్యాసంవత్సరానికి గాను ఐదో తరగతిఇంగ్లీష్‌ విూడియంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆ విద్యాలయాల జిల్లా సమన్వయకర్తఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాలోని 14 పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు.జిల్లాలోని పాఠశాలల వారీగా సీట్లు, దరఖాస్తు విధానం వంటి వివరాలను వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే తరుణంలో హాల్‌టికెట్‌ను పొందవచ్చన్నారు. ఏప్రిల్‌ 12న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *