గుంటూరు : బీఈడీ కోర్సు పేరిట ఘరానా మోసం
వినుకొండ, ఆగస్టు 25 : బీఈడీ కోర్సు పేరుతో కొందరు వ్యక్తులు పశ్చిమబెంగాల్‌కు చెందిన 54 మంది విద్యార్థులను మోసగించారు. వినుకొండలోని సెవెన్‌హిల్స్ బీఈడీ కాలేజీలో చేరేందుకు స్థానిక ఏజెంట్లకు రూ.30 లక్షలు చెల్లించామని పశ్చిమబెంగాల్ విద్యార్థులు ఆరోపించారు. ఈ రోజు ప్రారంభమైన బీఈడీ పరీక్షలకు అధికారులు అనుమతించలేదు. కాగా ఈ సంఘటనతో తమకు సంబంధం లేదని వినుకొండలోని సెవెన్‌హిల్స్ బీఈడీ కాలేజీ కరస్పాండెంట్ చెప్పారు.