యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆమోదించింది. గుజరాత్ కొత్త సీఎం ఎంపికపై ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ నేత సరోజ్ పాండేలు ఆ కమిటీలో ఉన్నారని, వారిద్దరూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో గుజరాత్ నేతలతో చర్చిస్తారని తెలిపారు. కమిటీ నివేదిక తర్వాత గుజరాత్ కొత్త సీఎంను ప్రకటిస్తామన్నారు. అయితే అమిత్‌షా గుజరాత్ సీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, అమిత్‌షా బీజేపీ అధ్యక్షుడిగానే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. యువనాయకత్వం రావాలని ఆనందీబెన్ కోరుకున్నారన్నారు. ఆనందీబెన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని వెంకయ్య తెలిపారు.
గుజరాత్ సీఎం రాజీనామా ఆమోదం




