నల్లగొండ,ఫిబ్రవరి23(జనంసాక్షి): సీపీఐ పార్టీ 20వ జిల్లా మహాసభలుమార్చి 3 నుంచి 5 వరకు నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి తెలిపారు. సభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలు హాజరువుతారని తెలిపారు. మహాసభలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఖమ్మం లో మార్చి 7 నుంచి 10 వరకు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నట్లు తెలిపారు.




