Wednesday, 4 November 2026

చెరుకు అమెరికా వైద్యానికి ప్రభుత్వ ఖర్చు

మెదక్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ఆరోగ్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించనుంది.  అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి మెరుగైన వైద్యం నిమిత్తం అమెరికాకు వెళ్లారు.  మెరుగైన వైద్య పరీక్షలు చేసుకునేందుకు ఆదివారం రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియజేయగా..  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముత్యంరెడ్డిని అమెరికా పంపించి వైద్యం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హావిూ ఇచ్చారు.   దాదాపు నెల పాటు అక్కడే ఉండి వైద్యం తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *