ఎస్.రాయవరం : విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం మండలం అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున ఎలమంచిలి నుంచి తుని వైపు ఇద్దరు. యువకులు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాల తెలియాల్సిఉంది.




