గుర్రమెక్కి వచ్చి నామినేషన్‌

 

నిజామాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థిగా చక్రధర్‌ శర్మ మంగళవారం నామినేషన్‌ వేశారు. ఆయన తన కార్యాలయం నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి గుర్రంపై వచ్చారు. గుర్రంపై వస్తూ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఆకర్శణగా నిలిచారు. రిటర్నింగ్‌ అధికారి జాన్‌ సాంసన్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ప్రతి ఎన్నికల్లో చక్రధర్‌ శర్మ వినూత్నంగా వచ్చి నామినేషన్‌ వేస్తుంటారు. ఎన్నికల నేపథ్యంలో పలుప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్సులను, ఇతర వాహనాలను సమగ్రంగా పరిశీలించారు. మద్యం, డబ్బుపై నిఘా పెట్టినట్లు తెలిపారు. రహదారులపై వాహనాలను తనిఖీ చేశారు.