Tuesday, 3 November 2026

గేల్కు లైన్ క్లియరైనట్లే!

మెల్బోర్న్:’ ఏ బేబీ నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి.  కలిసి డ్రింక్ చేద్దాం వస్తావా.. సిగ్గు పడవద్దు’  అంటూ ఆస్ట్రేలియాకు చెందిన మహిళా జర్నలిస్ట్ పై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్ సందర్భంగా గేల్ ఈ రకంగా వ్యహరించి వివాదాల్లో చిక్కుకున్నాడు.  దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక గేల్ ను బిగ్ బాష్ లీగ్లో పాల్గొనకుండా చేయాలని పలువురు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు.

అయితే గేల్ తీరును క్రికెట్ ఆస్ట్రేలియా లైట్గా తీసుకున్నట్టుంది. అటు ఆస్ట్రేలియా మాజీల నుంచి వచ్చిన విమర్శలను పక్కకు పెట్టిన సీఏ.. వచ్చే సీజన్లో బిగ్ బాష్ లీగ్ లో గేల్ ఆడేందుకు ఎటువంటి అభ్యంతరాలూ లేవంటూ తాజాగా స్పష్టం చేసింది. ‘ బిగ్ బాష్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు ఏమైనా జరిగితే మాత్రమే మా జోక్యం ఉంటుంది. ఆటగాళ్ల నియమాకాల విషయం మాత్రం మాకు సంబంధం లేదు. బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పించడం క్రికెట్ ఆస్ట్రేలియా పని కాదు. అందుచేత బిగ్ బాష్లో ఆడేందుకు గేల్ ఆడేందుకు మా నుంచి ఎటువంటి అడ్డంకులు లేవు’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటిల్ జేమ్స్ సథర్లేండ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *