గొర్రెలు మేకలకు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తున్న వైస్ ఎంపీపీ

మల్దకల్ జూన్13(జనం సాక్షి) మండలం పరిధిలోని మద్దెలబండ,మంగంపేట, అమరవాయి గ్రామాలలో 12055 గొర్రెలకు,593 మేకలకు ఉచిత నట్టల నివారణ మందులుసోమవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్నిమండల వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, సర్పంచ్ జయమ్మ నారాయణ ,గొర్రెల పెంపకం సహకార సంఘం అధ్యక్షుడు నర్సింలు ప్రారంభించడం జరిగింది. రైతులు ఉచిత నట్టల నివారణ మందులు సద్వినియోగం చేసుకోవాలని జీవాలకు సీజనల్ లో వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది కె వెంకటేశ్వర్లు ,రాఘవేంద్ర, వెంకటేష్,రాజేంద్ర, రామాంజనేయులు, హరిచంద్ర రెడ్డి,మధు, పాల్గొనడం జరిగింది