గోదావరిలో యువకుడి గల్లంతు

కన్నీరుమున్నీరైన కుటుంబం

కాకినాడ,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తూర్పుగోదావరిజిల్లా పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగుపల్లి వద్ద గోదావరిలో యువకుడు గల్లంతయాడు. ఆర్‌.ఏనుగుపల్లికి చెందిన చొల్లంగి సోమశేఖర్‌(32) ఏళ్ల యువకుడు ఉపాధి నిమిత్తం ఖతార్‌ వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. గ్రామంలో వైనతేయ గోదావరి చెంతన ఉన్న దుర్గాదేవిని దర్శించుకుని అనంతరం బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ కాలు జారి వైనతేయ గోదావరిలో కొట్టుకుపోయాడు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. భర్త గల్లంతవ్వటంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సంఘటనా ప్రదేశానికి చేరుకుని గల్లంతైన సోమశేఖర్‌ ఆచూకీ కోసం గాలించాలని అధికారులను ఆదేశించారు.

 

తాజావార్తలు