గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
హైదరాబాద్,ఆగస్ట్21(జనం సాక్షి): గోహత్యలు ఆపాలంటూ ఆందోళనకు దిగాలనుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ధూల్‌పేట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్షకులపై తప్పుడు కేసులు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీక్ష చేసేందుకు ప్రయత్నించారు. బషీర్‌బాగ్‌లో సీపీ ఆఫీసు ఎదుట నిరవధిక దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే రాజాసింగ్ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. కాగా రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్‌కు పంపించారు. తన గోరక్షణ ఉద్యమానికి, పార్టీకి లింక్ పెడుతున్నారని, తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదని రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.




