గో బ్యాక్ తెలంగాణ వ్యతిరేకి మోడీ గో బ్యాక్.. – సి పి ఐ జిల్లా కార్యదర్శి కె బిక్షపతి
హన్మకొండ బ్యూరో చీఫ్ 11 నవంబర్ జనంసాక్షి
రేపు తెలంగాణ రాష్టం లో పర్యటన కై వస్తున్న మోడీ ని ప్రజా వ్యతిరేక విధానాలను ఆలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా దోచిపెడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిరంతరం పెంచుతూ ప్రజలకు గుదిబండగా మారిన మోడీకి తెలంగాణకు వచ్చే హక్కు మోడీకి లేదని హనుమకొండ జిల్లా కార్యదర్శి. K. బిక్షపతి హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం లో చేరుకున్న బయ్యారం స్టీల్ ప్లాంట్ గిరిజన యూనివర్సిటీ మైనింగ్ యూనివర్సిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా వాసుల చిరకాల కోరిక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఇంతవరకు అతిగా తెలియదని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదని తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న మోడీ కన్ను ఇప్పుడు సింగరేణిపై పడిందని ప్రైవేటీకరణ చేసే దురుద్దేశంతో తెలంగాణకు వస్తున్నారని మండి పడ్డారు మోడీ ఆటలు సాగనివ్వమని మోడీ పర్యటనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని బిక్షపతి పిలుపునిచ్చారు.