కాకినాడ,ఫిబ్రవరి26(జనంసాక్షి): వినియోగదారులకు అందించే సిలిండర్ల ద్వారా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారులు హెచ్చరించారు. పెద్ద సిలిండర్లను ఉపూయోగించి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రావులపాలెంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా పలు ¬టల్స్, టీస్టాల్స్ తదితర వాటిల్లో తనిఖీలు నిర్వహించగా గృహవినియోగ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈదాడులు నిర్వహించామన్నారు. ఈప్రాంతంలో సిలిండర్లు నుంచి చిన్న చిన్న సిలిండర్లుకు గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తున్నారా అనే కోణంలో కూడా తనిఖీలు చేశామన్నారు. అయితే రీఫిల్లింగ్ చేస్తున్నవారు ఇప్పటికే మూసివేసి ఉండటంతో వారెవరూ తమకు దొరకలేదన్నారు. రావులపాలెం మొత్తంవిూద తనిఖీలు నిర్వహించగా పలు ¬టల్స్, టీకొట్లులో సిలండర్లును స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా ఈ సిలిండర్లను వినియోగిస్తున్న 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలా ఎవరైనా చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటామని అన్నారు.




