గ్యాస్ మాటలతో బోల్తా
– సబ్సిడీ వదిలివేసిన వినియోగదారుల్లో అంతర్మథనం
న్యూఢిల్లీ: పేద వర్గాలకు గ్యాస్ సిలిండర్లను అందించేందుకు రెండేండ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు సబ్సిడీలను వదులుకున్న వేలాది మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తమ నిర్ణయంపై పునరాలోచిస్తున్నారు. ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమంతో పేదలకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ఊదరగొట్టడంతో దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది సబ్సిడీలను వదులుకు న్నారు. అయితే వీరిలో 1లక్షా 12వేల655 మంది దీన్ని పొరపాటు నిర్ణయంగా పరిగణిస్తున్నారని సమాచారం.ఇక మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 23వేల మంది గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకు న్నారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది.గివ్ ఇట్ అప్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ 20,000 కోట్ల రాబడి సమ కూరిందని చెబు తున్నారు.అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరు గుతుండటంతో ఎల్పీజీ సబ్సిడీ వదులకుని పెద్ద తప్పు చేశామనిఉదారంగా సబ్సిడీని వదిలి వేసిన పలువురు భావిస్తున్నారు.మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతుండటం కూడా వారిని ఆందోళనకు గురిచేస్తున్నది.ఎల్పీజీ ధరలు పెరుగుతుం డటంతో తిరిగి సబ్సిడీని పొంది చవక ధరకు సిలిండర్ పొందాలని వారు భావిస్తున్నారు.సబ్సిడీని తొందరపడి వదిలి వేశామని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలపై ఒత్తిడి అంత కంతకూ పెరుగుతున్నది.దీంతో తిరిగి ఎల్పీజీ సబ్సిడీని పొందేందుకు వారు ‘గివ్ ఇట్ బ్యాక్’ అని నినదిస్తున్నారు. సబ్సిడీ,సబ్సిడీ యేతర సిలిండర్ ధరల వ్యత్యాసం పెరుగుతుండటంతో సబ్సిడీని వదిలివేసిన వారిపై ఒత్తిడి పెరుగుతున్నది.గో ఇట్ అప్ స్కీమ్ ప్రారంభానికి ముందు 2016 సెప్టెంబర్లో సబ్సిడీయేతర సిలిండర్లు ఢిల్లీలో రూ470కు విక్రయించగా, సబ్సిడీ సిలిండర్ ధర రూ 420గా ఉంది.ఇప్పుడు సబ్సిడీలను వదులుకున్న అనంతరం ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ 440 కాగా,సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ 725 పలుకుతున్నది.ధరల వ్యత్యాసం అంతకంతకూ పెరుగుతుం డటంతో సబ్సిడీని వదులుకుని తొందరపాటు నిర్ణయం తీసుకున్నామనే అభిప్రాయం మధ్యతరగతి,ఎగువ మధ్యతరగతి వర్గాల్లో వ్యక్తమవుతున్నది.