గద్వాల,నవంబర్28(జనంసాక్షి): మహాకూటమి చేప్పే కుట్రల మాటలు నమ్మొదని, రాష్ట్రం లో జరిగిన అభివృద్ధిని చూసి ఆదరించాలని గద్వాల టిఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల్లో ఆయన విసృత్తంగా ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేస్తానన్నారు. మాయకూటమి చేప్పే మా యమాటలను నమ్మి మోసపోవద్దన్నారు. గత 70ఏళ్ల చేపట్టని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘన త సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సాగునీరు, 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, పథకాలు కొనసాగాలంటే టీఆర్ ఎస్‌కే పట్టం కట్టాలన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగం, విద్య, సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టాల్సిన బాధ్యత విూదేనన్నారు.
గ్రామాల్లో విసృతంగా ప్రచారం




