గ్రామ అభివృద్ధియే ప్రథమ లక్ష్యం

చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరజ వీరారెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరజ వీరారెడ్డి మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధియే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ అందులో భాగంగా గ్రామంలో అండర్ డ్రైనేజ్ మరియు మంచినీటి సమస్యలపై గ్రామసభ నిర్వహించుకొని తీర్మానించుకోవడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బ్రహ్మానందరెడ్డి,ఉపసర్పంచ్ కుమ్మరి అనంతయ్య,మాజీ సర్పంచ్ రాములు,ఆంజనేయులు, హనుమంతు,చెన్నయ్య,రాములు,కృష్ణాజీ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.