– అందుకే నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చాం
– సర్పంచ్‌లకు, పాలకవర్గాలకు పూర్తి అధికారాలిస్తున్నాం
– దేశంలోనే నూతన చట్టాన్ని రూపొందించుకున్న రాష్ట్రం తెలంగాణ
– రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
– నూతన చట్టంపై అధికారులకు అవగాహన
హైదరాబాద్, మే3(జనం సాక్షి) : గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన
చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రావిూణాభివృద్ధి సంస్థలో నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యకార్యనిర్వాహణ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ విస్తరణ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ..దేశంలోనే నూతన చట్టాన్ని రూపొందించుకున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 25 ఏళ్ల క్రితం రూపొందించిన చట్టానికి సవరణలు చేశామని జూపల్లి పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ఐపాస్ లాంటి పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా మన గ్రామాలను కూడా దేశానికి ఆదర్శంగా నిలుపుదామన్నారు. నూతన చట్టంపై అధికారులంతా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. సర్పంచులకు, పాలక వర్గాలకు పూర్తి అధికారాలు ఇస్తున్నాం. గ్రామాలకు నిధులు కూడా పెంచుతున్నాం. గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దుకోవాలని దిశానిర్దేశర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లోకి పూర్తిస్థాయిలో ప్రభుత్వం పథకాలు దరిచేరలేదని, దీంతో పలు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాల అభివృద్ధిపై దృష్టిసారించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తొలుత జిల్లాల పునర్విభజన చేయడం జరిగిందని, పునర్విభజనతో పత్రి మారుమాల పల్లెకు ప్రభుత్వ పథకాలు, అధికార ఫలాలు చేరుతున్నాయన్నారు. దీనికితోడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల్లో మరింత పారదర్శకంగా అభివృద్ధి చెందుతాయన్నారు. సర్పంచ్‌లకు, పాలక వర్గాలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వటం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. అధికారులు నూతన పంచాయతీరాజ్చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండి గ్రామాల్లో అమలు చేయాలని సూచించారు.
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం




