Thursday, 5 November 2026

గ్రావిూణాభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా..  తెదేపా మేనిఫెస్టో

– త్వరలోనే గ్రావిూణాభివృద్ధి కేంద్రం ఏర్పాటు
– టెక్నాలజీ అనుసంధానంతో గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుంది
– రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు
– గ్రామాల్లో 30లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నాం
– ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌
విజయవాడ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : గ్రావిూణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ గేట్‌ వే ¬టల్‌ లో నిర్వహించిన గ్రామస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు అంశంపై నిర్వహించిన సదస్సుకు హాజరైన లోకేష్‌ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధిపైనే తమ పార్టీ దృష్టిసారించి అందుకు అనుకుణంగా అభివృద్ధి ప్రణాళికలు రచిస్తుందని వెల్లడించారు. 11స్టార్ల విధానాన్ని గ్రామాభివృద్ధి కోసం అనుసరిస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు 40రకాల ప్రామాణికాలను అంచనా వేస్తున్నామని,  జియోట్యాగింగ్‌ ద్వారా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తామని చెప్పారు. గ్రావిూణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, పరిసరాలు, కుటుంబ ఆరోగ్యం, ఆదాయం తదితర అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని ఆయన వెల్లడించారు. టెక్నాలజీ అనుసంధానంతో గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. త్వరలోనే గ్రావిూణాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో వస్తాయన్నారు. 10లక్షల ఐవోటీ పరికాలు వినియోగిస్తున్నామని తెలిపారు. కోర్‌ డ్యాష్‌ బోర్డు ద్వారా వివిధ శాఖల సమాచారం అందుబాటులో ఉంచామన్నారు. సర్టిఫికెట్‌ లెస్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తిపై దృష్టిసారించామన్నారు. గ్రామాల్లో 30లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామని మంత్రి లోకేష్‌ అన్నారు.