గ్రీన్ఇండియా చాలెంజ్
ముస్తాబాద్ జూన్ 1 జనం సాక్షిముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ సర్పంచ్ కాసోల్ల పద్మ -దుర్గాప్రసాద్ గార్ల పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందిరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తమ పెళ్లి రోజు సందర్భంగా తుర్కపల్లి గ్రామ అవన్యో ఆవరణలో మొక్కలు నాటడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమారు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.