Wednesday, 4 November 2026

గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరిన కెటిఆర్‌

హైదరాబాద్‌,జూలై27(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దర్శకుడు రాజమౌళి ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను కేటీఆర్‌ స్వీకరించి 3 మొక్కలు నాటారు. టీ-సాట్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం కేటీఆర్‌ మొక్కలు నాటారు. మరో ఐదుగురు ప్రముఖులకు హరిత సవాల్‌ విసిరారు కేటీఆర్‌. నటుడు మహేశ్‌బాబు, సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాకు కేటీఆర్‌ హరిత సవాల్‌ విసిరారు. ఈ ఐదుగురు మూడు మొక్కల చొప్పున నాటాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.