హైదరాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని, హైదరాబాద్ ప్రజలు ఏకపక్షంగా తీర్పునిస్తారని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు అన్నారు. ఇక్కడ సభ్యత్వం జోరుగా సాగిందనడానికి ఇటీవల వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రెండో స్థానంలో, తెదేపా మూడో స్థానంలో నిలుస్తుందనిజోస్యం చెప్పారు. అందుకు ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమమే నిదర్శనమన్నారు. నూతన ఎక్సైజ్ విధానంపై మాట్లాడుతూ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అన్నిశాఖలతో రివ్యూ నిర్వహించారని, ఇక కేవలం ఎక్సైజ్ శాఖ మిగిలి ఉందన్నారు. గుడుంబాను అరిక్టటేందుకు ఆలోచిస్తున్నారని, నిర్ణయాన్ని త్వరలో ముఖ్యమంత్రే ప్రకటిస్తారని స్పష్టం చేశారు.




