Tuesday, 3 November 2026

గ్రేటర్‌ పరధిలో మూడో రోజు..

ఆక్రమణల తొలగింపు
– పోలీసుల భద్రత నడుమ అక్రమ కట్టడాలు తొలగించిన సిబ్బంది
హైదరాబాద్‌, జులై2(జ‌నం సాక్షి ): గ్రేటర్‌ పరిధిలో మూడో రోజు ఫుట్‌ పాత్‌లపై అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. సోమవారం కాచిగూడ, హిమయత్‌ నగర్‌, అవిూర్‌పేట్‌, పంజాగుట్ట, హఫీజ్‌పేట, కూకట్‌పల్లిలో గల అక్రమ నిర్మాణాలు తొలగింస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో రెండు రోజుల పాటు జరిగిన తొలగింపును పలు ప్రాంతాల్లో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సహకారంతో అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన జీహెచ్‌ఎంసీ గత రెండు రోజులుగా వాటిని తొలగించే పక్రియను చేపట్టింది. బల్దియా ఎన్‌పోర్స్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఆక్రమణల కూల్చివేత జరుగుతోంది. మొత్తం 48 ప్రాంతాల్లో 121 కి.విూ. మేర ఫుట్‌పాత్‌లపై నిర్మాణాల తొలగించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 5వేల ఆక్రమలను తొలగించనుంది. జోన్‌కు ఒక్కటి చొప్పున ఆరు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉండనున్నారు. పోలీస్‌, టౌన్‌ ప్లానింగ్‌, ట్రాఫిక్‌, రెవెన్యూ ట్రాన్స్‌కో అధికారుల సహకారంతో స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు.