Sunday, 8 November 2026

గ్రేటర్‌ ఫలితాలే హైదరాబాద్‌లో వస్తాయి: తలసాని

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే శాసనసభ ఎన్నికల్లో రాబోతున్నాయని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ లాంటి నగరం ఉండడం గర్వకారణమన్న ఆయన.. మళ్లీ అధికారంలోకి రాగానే.. హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయని స్పష్టం చేసారు. గొప్ప దార్శనికుడైన సీఎం కేసీఆర్‌కు ప్రజాసమస్యల పట్ల సంపూర్ణ అవగాహన, స్పష్టత ఉన్నాయని.. కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. సనత్‌ నగర్‌ నియోజవకర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేపట్టారు.