Sunday, 8 November 2026

వికారాబాద్‌ స్టేషన్‌ సందర్శించిన లోహానీ

వికారాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ను భారత రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్వనీ లోహానీ శనివారం ఉదయం సందర్శించారు. ప్రత్యేక రైలులో వికారాబాద్‌కు వచ్చిన ఆయన రైల్వే ట్రాక్‌ను, స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌కు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరిగి అదే రైలులో వెళ్లిపోయారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ యాదవ్‌, వికారాబాద్‌ స్టేషన్‌ మాస్టర్‌ మోహన్‌ రావు ఉన్నారు.