విశాఖపట్టణం,నవంబర్13(జనంసాక్షి): గ్రేటర్ విశాఖ పాలకసంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు.
జీవీఎంసీలో వివిధ పంచాయతీల విలీనానికి సంబంధించి న్యాయస్థానంలో కేసులు ఉన్న నేపథ్యంలో నగరపాలక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చేసిన ప్రకటనే దీనికి కారణం. ఈ కారణంగా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. అధికార టిడిపి కూడా ఇప్పుడే ఎన్నికల నిర్వహణ చేయాలని భావించడం లేదని మంత్రి ప్రకటన రుజువు చేస్తోంది. పంచాయతీల విలీనం సమయంలో వార్డుల మధ్య అనుసంధానం లేకపోతే సాంకేతిక సమస్యలు ఎదురవుతాయన్నారు.




