ఘనంగా కోట్ల జయంతి వేడుకలు
కర్నూలు,ఆగస్ట్16(జనం సాక్షి ): సమైక్య ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 99వ జయంతి వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీమంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తన తండ్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. పలువురు చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం విజయభాస్కర్‌రెడ్డి సమాధి ప్రాంతం కిసాన్ ఘాట్ చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయసూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విజయభాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కోట్ల అభిమానులు విజయభాస్కర్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.