Tuesday, 3 November 2026

ఘనంగా గణతంత్య్ర వేడుకలు

C

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

– ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌

– మొదటిసారిగా విదేశీ సైన్యం కవాతు

న్యూఢిల్లీ,జనవరి26(జనంసాక్షి):  పటిష్ఠ భదత్రా ఏర్పాట్ల మధ్య దిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి. దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ¬లాండ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ఆహూతులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్‌ ¬లాండ్‌ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ¬లాండ్‌ను ఈ వేడుకకు సాదరంగా తోడుకొని వచ్చారు. కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాజ్‌పథ్‌ ఆవరణలో కళ్లుచెదిరే రీతిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు కొనసాగాయి. మొదట త్రివిధ దళాలు కవాత్తు నిర్వహించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వందనం సమర్పించాయి. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబసభ్యులకు, విశేష సేవలందించిన వీర సైనికులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు ప్రదానం చేశారు. మువన్నెల పతాపు రెపరెపల కింద శకటాల కవాత్తు, సైనికుల కళ్లు చెదిరే విన్యాసాలతో కోలాహలంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సైనిక బలగాలు తమ పాటవాన్ని, శక్తిసామర్థ్యాలను విశేష రీతిలో ప్రదర్శించాయి. మొట్టమొదటిసారిగా ఈసారి విదేశీ సైన్యం కూడా రాజ్‌పథ్‌ వద్ద కవాతు నిర్వహించింది. ఫ్రాన్స్‌ సైన్యం తన విన్యాసాలతో ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, సదానందగౌడ, రవిశంకర్‌ ప్రసాద్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సైనిక దళాల ప్రధాన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాన్స్‌నాయక్‌ మోహన్‌నాథ్‌ గోస్వామికి ప్రకటించిన అశోక చక్ర పురస్కారాన్ని ఆయన సతీమణికి రాష్ట్రపతి చేతుల విూదుగా అందజేశారు. దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే  గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి.  ఈ వేడుకల్లో విశిష్ట అతిథిగా ఫ్రాన్స్‌  అధ్యక్షుడు ¬లాండ్‌  రావడంతో ఈ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఏటా గణతంత్ర వేడుకలకు ఇతర దేశాల నుంచి అతిథులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. వేడుకల సందర్భంగా  రాజ్‌పథ్‌వద్ద భద్రతా బలగాలు భారీ స్థాయిలో మోహరించాయి. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌పారికర్‌, సైనిక దళాల ప్రధాన అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో మూడంచెల భద్రత అమలు చేస్తున్నారు. దిల్లీలో గగనతల విహారంపై కేంద్రం ఆంక్షలు విధించింది.   గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌, రాజ్యాంగ రూప కల్పనలో పాలుపంచుకున్న మహానుభావులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

రాజ్‌పథ్‌లో గులాబీ పూల వర్షం

గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా 76మంది ఫ్రెంచి సైనికులు కవాతు నిర్వహించారు. టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకు, రాడార్ల ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకలు జరుగుతున్న రాజ్‌పథ్‌ మార్గంలో హెలికాప్టర్ల ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏడంచెల భద్రత అమలు చేశారు.

ఆకట్టుకున్న శునకదళం ప్రదర్శన

వేడుకల్లో భాగంగా త్రివిధ దళాల కవాతు అట్టహాసంగా సాగింది. సైనిక కవాతులో శునక దళం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అలరించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అతిథులు, సందర్శకులతో రాజ్‌పథ్‌ జనసంద్రంగా మారింది. గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన త్రివిధ దళాల పరేడ్‌ ఆకట్టుకుంది. సైన్యం, వాయుసేన, నావికాదళ బృందాల పరేడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర కవాతు మహిళా సాధికారతను చాటింది.66వ గణతంత్ర వేడుకలు దిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన త్రివిధ దళాల పరేడ్‌ ఆకట్టుకుంది. సైన్యం, వాయుసేన, నావికాదళ బృందాల పరేడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర కవాతు మహిళా సాధికారతను చాటింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వివిధ రాష్రాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *