Tuesday, 3 November 2026

ఘనంగా గణతంత్ర వేడుకల ఏర్పాట్లు

భద్రతా చర్యలను పరిశీలించిన సిపి

హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పలువురు విఐపిలు రానుండడంతో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా 50 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే వీక్షకులు 10 నిమిషాల ముందే మైదానానికి రావాలని సీపీ సూచించారు. పరేడ్‌ మైదానంలో సైనిక, వాయుసేన, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, పోలీసుల కవాతు నిర్వహించారు. గవర్నర్‌ జెండా ఆవిష్కరిస్తారు. సిఎం కెసిఆర్‌ తదితర ప్రముఖులు మాజరవుతారు.