ఘనంగా గొట్టిముక్కల వెంగాల్ రావు జన్మదిన వేడుకలు..

శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొజెస్
కూకట్ పల్లి జనంసాక్షి :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు జన్మదిన వేడుకలు ఆదివారం కూకట్పల్లిలోని ఎన్ఆర్ సి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్బి, బాలాజీ నగర్,  అల్లాపూర్, మూసాపేట్, ఫతేనగర్, బోయిన్పల్లి, బాలానగర్, కూకట్ పల్లి డివిజన్ ల నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకుని పూల మొక్కలు అందజేసి కేకు కట్ చేయించి వెంగళరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ నాయకులు సయ్యద్ మిస్బా ఆధ్వర్యంలో బోయిన్పల్లి లోని సర్వనీడి అనాధ ఆశ్రమంలోని అనాధ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అద్యక్షులు రఘు, శమీ, అస్లం, ఉదయ్, కిషన్, శివ, సుధాకర్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్,నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.