ఘనంగా జన్మదిన వేడుకలు

 వీణవంక నవంబర్ 2 ( జనం సాక్షి) రాష్ట్ర ఎన్. స్. యు. ఐ అధ్యక్షులు బాలుమూరి వెంకట్ జన్మదిన వేడుకలు వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమనికి టీ. పి. సి.సి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి ముఖ్య అతిది గా హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతు.. అతి చిన్న వయస్సులో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి విద్యార్థినీ విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూ వారి మన్నలను పొందుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన నాయకుడు బలుమూరి వెంకట్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు, మరియు యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నాయకుడు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి బలుమూరి వెంకట్ ఇంకా ముందు ముందు అనేక ఉన్నతమైన పదవులు అలంకరించాలని వారన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిరంతరం పోరాట ప్రతిభ కలిగిన యువ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకెళ్లే నాయకుడు అని వారన్నారు అనంతరం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, టిపిసిసి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, నాయకులు చదువు జైపాల్ రెడ్డి, జిన్నుతుల మధుకర్ రెడ్డి, శీలం నరసింహారెడ్డి, సుఖశి యాదగిరి,చింతిరెడ్డి కొమల్ రెడ్డి, గుంపుల గట్టయ్య, పైడి కుమార్, ఉపేందర్ రెడ్డి, మందల అనిల్ రెడ్డి, బుజ్జయ్య, ఎండి సలీం, రాఘవరెడ్డి, అజయ్. మాదాసు సునీల్, రాజయ్యతదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు