Tuesday, 3 November 2026

*ఘనంగా జెట్టి వెంకటరెడ్డి 22వ వర్ధంతి వేడుకలు*

మునగాల, జూన్ 10(జనంసాక్షి): మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన బడుగు బలహీనవర్గాల ముద్దుబిడ్డ, కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జెట్టి వెంకటరెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ కొప్పుల వీరమ్మ, ఉపసర్పంచ్ ఏనుగుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గల జెట్టి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలకు జెట్టీ వెంకటరెడ్డి చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన మరణం గ్రామానికి తీరనిలోటని అన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ పయనించాలని వారు పిలుపునిచ్చారు. జెట్టి నర్సిరెడ్డి మరియు గ్రామ పెద్దల సహకారంతో జెట్టి వెంకటరెడ్డి నివసించిన వీధికి జెట్టి వెంకట్ రెడ్డి గారి వీధి అనే నామకరణం చేసి త్వరలోనే ఆ వీధి ప్రారంభంలో ఒక ఆర్చి నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరాల రుక్కరావు, ఉప్పుల ఇంద్రారెడ్డి, రమేష్ బాబు, జెట్టి నర్సిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.