ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టేకులపల్లి ,జూన్ 2 (జనం సాక్షి): టేకులపల్లి మండలం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస రావు తెలంగాణ జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భూక్యా రాధ జెండాను ఆవిష్కరించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీజేఎస్ కార్యాలయంలో పార్టీ ప్రతినిధులు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచులు చేతులమీదుగా జెండాను ఆవిష్కరించారు.