ఘనంగా దలైలామా జన్మదిన వేడుకలు

న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి ): టిబెట్‌ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా 83వ జన్మదిన వేడుకలు శుక్రవారం లడఖ్‌లో ఘనంగా జరిగాయి. తన అనుచరులు, శిష్యులతో కలిసి దలైలామా.. కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దలైలామా అభిమానులు ప్రార్థనలు చేశారు. దలైలామా బర్త్‌డే వేడుకల్లో టిబెట్‌ ప్రధానమంత్రి లోబ్సాంగ్‌ సంగాయ్‌ పాల్గొన్నారు. టిబెట్‌ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దలైలామా కోరుకున్నారు. లెహ్‌ ప్రజలతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. లేహ్‌ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని దలైలామా చెప్పారు. మరోవైపు దలైలామాకు పలువురు శుభాకంక్షలు చెప్పారు. ఆయన ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకున్నారు.