ఘనంగా నిర్వహించిన మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

నంగునూరు, జూన్03(జనంసాక్షి):
రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు 50వ జన్మదిన వేడుకలను  ఆయన అభిమానులు నంగునూరు మండల వ్యాప్తంగా శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని సిద్దన్నపేట గ్రామానికి చెందిన కొన్నే సంపత్ అనే అభిమాని ఎంపిటిసి బెదురు తిరుపతి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు అన్నదానం, పండ్లు, నోట్ బుక్స్, ఫ్యాన్లు పంపిణీ పలు సేవా కార్యక్రమాలు చేసి మంత్రిపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు.ఈ కార్యక్రమంలోఎంపీటీసీ బెదురు తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు బండి మల్లేశం,రైతు బంధు సభ్యులు బెదురు మల్లేశం,స్కూల్ చేర్మెన్ పరకాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు డాకురి భాస్కర్ రెడ్డి,చిలుకల తిరుపతి రెడ్డి,మహి,మల్లేశం, పర్శారములు,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.