ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం

వలిగొండ జనం సాక్షి న్యూస్ నవంబర్ 19: మండల పరిధిలోని పైల్వాన్ పురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛత రన్ సంపూర్ణ స్వచ్ఛత కోసం పరుగు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా గ్రామంలోని వివిధ మహిళా సంఘాలను  యువజన సంఘాలను పాఠశాల విద్యార్థులు ఇతర సంఘాలను భాగస్వాములను చేస్తూ స్వచ్ఛత రన్ ర్యాలీ  నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సిద్దులు ప్రధానోపాధ్యాయులు సోలిపురం శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి జలంధర్ రెడ్డి ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్త ఆశా కార్యకర్త చంద్రకళ యువకులు మహిళలు విద్యార్థులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు