Saturday, 7 November 2026

ఘనంగా ప్రవక్త జన్మదిన వేడుకలు

విజయనగరం,నవంబర్‌21(జ‌నంసాక్షి): మహమ్మద్‌ ప్రవక్త జన్మ దినం సందర్భంగా బుధవారం విజయనగరంలోని ముస్లిములు ఆనందంగా పండుగను నిర్వహించుకుంటున్నారు. చిన్నా పెద్దలంతా కలిసి రాత్రంతా మసీదుల్లో ప్రార్థనలు చేసి ఉదయం అంబటి సత్రం వద్ద ఉన్న ఉర్దూ పాఠశాల వద్ద నుంచి ఆనంద హేళీలతో ర్యాలీగా బయలుదేరారు. కోట, బాలాజీ జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌, అశోకా హల్‌ , కన్యకా పరమేశ్వరి కోవెల, గంట స్తంభం విూదుగా మూడులాంతర్ల దగ్గర ఉన్న మసీదుకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిము సోదరులు జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నారు.