ఘనంగా మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

టేకులపల్లి, జూన్ 15( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర సి ఎల్ పి నేత,మధిర శాసన సభ్యులు “మల్లు భట్టి విక్రమార్క”జన్మదిన సంధర్బంగా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుక కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏలూరి కొటేశ్వరావు, బాణోత్ సాములు నాయక్, భూక్య దళ్ సింగ్ నాయక్ లు మాట్లాడుతూ రెండు పర్యాయాలు సీఎల్పీ నేతగా వ్యవహరిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలోనూ పాదయాత్రల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తూ ఎండగడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ జన్మ దిన వేడుక కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండా నర్సింహారావు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న ,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు రాసమల్ల నరసయ్య, ఎస్ టి సెల్  భూక్య దేవా నాయక్, మాజీ సర్పంచులు ఇస్లావత్ రెడ్యా నాయక్, వీసం శ్రీనివాస రావు, ఈసం ప్రసాద్,భూక్య కొటేశ్వరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇస్లావత్ సాయి కృష్ణ,దంతోజు నవీన్ కుమార్,మూడ్ గణేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.