*ఘల్లు-ఘల్లు మన్న-అజ్జ కొల్లు గజ్జెలు*
పది లో వరుసగా నాల్గవ సారి 100% పాస్*
*పది లో మెరిసిన-అజ్జకొల్లు ఆణిముత్యాలు*
*అజ్జకొల్లు చరిత్రలోనే , అద్భుతమైన విజయం సాధించిన మట్టిలో మాణిక్యాలు*
. జనం సాక్షి, కొత్తకోట, జూన్30.,.
-మదనాపురం మండలం లోని అజ్జకొలు గ్రామ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు
10 వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించి
*ఆనందోత్సాహాలతో- సంబరాలు జరుపుకున్నారని ఆ హై స్కూల్ హెడ్మాస్టార్ అతీ క్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ అతీక్ అహేమద్ మాట్లాడుతూ…….
*మొత్తం 21 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 21 మంది ఉత్తీర్ణత సాధించి, 100 % ఫలితాలతో మండలం లో అగ్రభాగాన నిలిచారనీ తెలిపారు.ఇందులో1.మమత-9.3*
2. అరుణ్ -9.3,3.శ్రీను 9.0*
గ్రేడ్ పాయింట్స్ సాధించారనీ తెలిపారు.ఈ సందర్భంగా
*విద్యార్థులను, ఉపాధ్యాయులను
అభినందించిన ప్రధానోపాధ్యాయులు
శ్రీ అతీఖ్ అహ్మద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
SMC చైర్మన్ బీ. రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారనీ చెప్పారు.
ఈ ఫలితాల ఆనందంతో, మా బాధ్యతను మరింత త్రికరణశుద్ధితో నెరవేరుస్తామని, విద్యా ప్రమాణాలు పెంచడానికి శాయశక్తులా కృషి చేసి, అజ్జ కొల్లు పాఠశాల పేరు ప్రతిష్టలు ఇనుమడింపజెసి, “చుక్కల్లో చంద్రునిలా” ప్రకాశించడానికి అహర్నిశలు పాటుపడతామని… ప్రధానోపాధ్యాయులు శ్రీ అతీఖ్ హ్మద్ తెలిపారు.*
*వచ్చే సంవత్సరం కూడా 5వ సారి 100% ఫలితాలు సాధించి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఉపాధ్యాయులచే విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు ఆతీక్ అహేమద్ తెలిపారు.
Attachments area
|