Monday, 2 November 2026

ఘోర రోడ్డుప్రమాదంలో 8మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొనడంతో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

చెన్నైకి చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి స్కార్పియో కారులొ తిరుచ్చి బయలుదేరింది. ఈ ఉదయం తిరుచ్చి దగ్గర్లోని సమయపురం టోల్‌గేట్‌ కు కొంచెం దూరంలో అదుపుతప్పిన వాహనం…రోడ్ పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ట్రీట్ మెంట్ కోసం తిరుచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.