Friday, 6 November 2026

చంద్రన్న మళ్లీ విూరే రావాలంటూ పాదయాత్ర

మంత్రి యాత్రను ప్రారంభించిన ఎంపి

ఏలూరు,నవంబర్‌14(జ‌నంసాక్షి): చంద్రన్న మళ్లీ విూరే రావాలంటూ మంత్రి జవహర్‌ ద్వారకా తిరుమల పాదయాత్రను బుధవారం మొదలుపెట్టారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో రాజహమహేంద్రవరం ఎంపి మురళీ మోహన్‌ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎపిలో అభివృద్ది సాగాలంటే బాబు మళ్లీ అధికారం చేపట్టాల్సి ఉందన్నారు. అందుకే ఈ యాత్ర చేపట్టానని మంత్రి తెలిపారు. ఇదిలావుంటే దెందులూరు: మండలంలోని పోతునూరు, దెందులూరు గ్రామాల్లోని శాఖ గ్రంథాలయాల్లో 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం ప్రారంభించారు. దెందులూరులో మండల విద్యాశాఖాధికారి గారపాటి ప్రకాశరావు, పోతునూరులో మాజీ సర్పంచ్‌ జక్కుల దాసు ప్రారంభించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పండిట్‌ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. గ్రంథాలయాలు పుస్తక భాంఢాగారాలని యువత వాటిని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ప్రపంచంలో పెద్ద గ్రంథాలయం వాషింగ్టన్‌ డీసీలో ఉందని అక్కడ దాదాపు 10కోట్ల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని లీనివీ అన్నారు. మన వద్ద ఉన్న గ్రంథాలయాల్లో యువతకు అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాపాలకులు అరుణ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.