Friday, 6 November 2026

రాజకీయాలు మాట్లాడే వారికి తిరుమల ప్రవేశం లేకుండా చేయాలి

ఎమ్మెల్యే అనిత డిమాండ్‌

తిరుపతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): తిరుమలను వేదికగా చేసుకొని రాజకీయాలు మాట్లాడే వారిని స్వామి వారి దర్శనానికి అనుమతించకూడదని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆనంతరం ఆమె విూడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి, టిటిడి అధికారులకు, తిరుమలలో రాజకీయం మాట్లాడకూడదని ఒక అప్పీల్‌ ఇవ్వాలని అనుకుంటున్నానన్నారు. రాజకీయాలు మాట్లాడే వారిని స్వామి వారి దర్శనానికి అనుమతించకూడదని తెలిపారు. సంవత్సరం పాటు పాదయాత్ర చేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డికి భద్రత కల్పించింది ఎపి పోలీస్‌ కాదా అని ప్రశ్నించారు. ఎపి పోలీస్‌లను నమ్మనని జగన్‌ అనడం ఎంతవరకు కరక్ట్‌ అని ప్రశ్నించారు. ఎలాంటి కంప్లైంట్‌ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని విమర్శించడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు.