Tuesday, 3 November 2026

చంద్రబాబు ఎందుకు ఎవర్నీ పిలవలేదు?

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలాసవంతమైన ఇంటిని నిర్మించుకునేందుకు అయిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పేదవాడికి ఒక్క ఇల్లూ నిర్మించని సీఎం…కోట్ల రూపాయిలతో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకోవడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోజా గురువారం తిరుమల విచ్చేసి, స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *