Tuesday, 3 November 2026

చంద్రబాబు బాగా పనిచేస్తున్నారు

–  మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు
విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : కనకదుర్గమ్మను మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఏపీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, సీఎం, మంత్రులు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్టాన్రికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు, రెండు తెలుగు రాష్టాల్రు అభివృద్ధిలో పోటీపడుతూ ముందుకు సాగడం సంతోషంగా ఉందన్నారు.