– టీడీపీకి 30 సీట్లకు మించిరావు
– రాష్ట్రంలో రావాల్సిన పార్టీ అధికారంలోకి వస్తుంది
– ఆ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం ఉంటుంది
– బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజం
రాజమండ్రి, నవంబర్2(జనంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సిద్ధాంతాలను చంద్రబాబు పక్కన పెట్టేశారని మండిపడ్డారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్ తో చేతులు కలిపారని విమర్శించారు. చంద్రబాబు ఒక రాజకీయ దళారీ అని, రాజయకీయ వ్యభిచారి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబుపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తిరుగుబాటు చేయాలని కోరారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని… ఆ పార్టీకి 30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. అదే పార్టీతో చేతులు కలపడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ రాజకీయ దళారిలా మారారని, టీడీపీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేశారని మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి జాతీయ స్థాయి నేతలు కూడా తమ గౌరవాన్ని పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
సోనియాను దేశం నుంచి తరిమికొట్టాలన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్లీ వాళ్లతో కలిసేందుకు తాపత్రయపడుతున్నారన్నారని ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని విలేకరుల ప్రశ్నించాగా.. రాష్ట్రంలో రావాల్సిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తమ పార్టీ భాగస్వామ్యం కూడా ఉంటుందన్నారు. దేశాన్ని రక్షిస్తామని చంద్రబాబు చెబుతున్నారని.. దాని అర్ధం తెలుగు దేశాన్ని రక్షిస్తానని చెప్పడమే అన్నారు. యూపీఏ కూటమి అవినీతి కూటమి, అప్రజాస్వామిక కూటమి, ఈ కూటమిలో చేరిన పార్టీలు భూస్థాపితం అవుతాయన్నారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కూడా కనుమరగు అవుతుందన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు, విపత్తుకు దారితీస్తుందని సోము వీర్రాజు అన్నారు.
చంద్రబాబు రాజకీయ వ్యభిచారి




