చంద్రమోహన్‌ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్‌ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ (Chandramohan)‌.. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు.