Tuesday, 3 November 2026

చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్‌ కల్పించాలి

C

– ప్రతినిధ్యం తగ్గింది

– మహిళా ప్రజాప్రతినిధుల సభలో రాష్ట్రపతి

న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి):  పార్లమెంటు చట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సూచించారు. 1952 సాధారణ ఎన్నికల నుంచి నేటి వరకు మహిళల ప్రాతినిధ్యం 12 శాతానికి మించలేదని రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే సాధికారత ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు కల్పించాల్సి ఉందని రాష్ట్రపతి అన్నారు. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం చేపట్టిన ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. పౌరులందరికీ సమానహక్కులు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని.. కానీ మహిళల విషయంలో మాత్రం అమలు కావడం లేదన్నారు. చట్ట సభల్లో మహిళలకు సరియైన ప్రాతినిథ్యం కల్పించక పోవడం విచారకరమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. మహిళా సాధికారికతతోనే ధేశాభివృద్ధి సాధ్యమన్నారు. చట్ట సభల్లోనూ మహిళలకు సరియైన ప్రాతినిథ్యం పెరగకపోవడం విచాకరమన్నారు. 1952 నుంచి నేటి వరకు 12 శాతం మాత్రమే పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాగైతే మహిళల సాధికారికత ఎలా సాధ్యమన్నారు. ఇంకా మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులందరికి సమాన హక్కులు, అధికారాలు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని తెలిపారు. పలు రాష్ట్రాలు మహిళలకు 33 శాతం నుంచి 50 శాతానికి రిజర్వేషన్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు పార్లమెంట్‌, చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఈ సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోపాటు ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీతోపాటు పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: అన్సారీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌లో అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ అన్నారు.  భారత స్వాంతత్రోద్యమంలోనూ మహిళలు చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. రాజకీయ రంగంలోనూ మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో మహిళలు పోషించిన పాత్రను గుర్తు చేశారు. పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు రాజకీయ రంగంలోనూ సమ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. అలాంటపుడే దేశ ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగనుంది.  లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన ఈ సదస్సు ఆరంభమైంది. ఈ సదస్సులో  పలువురు కేంద్రమంత్రులు, ఏపీ, తెలంగాణ మహిళా నేతలు పాల్గొన్నారు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందిచట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతోందని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్నారు.

రాష్ట్రపతి, గవర్నర్‌, ముఖ్యమంత్రులుగా మహిళలు ప్రధాన భూమిక వహిస్తున్నారని సుమిత్రా మహాజన్‌ అన్నారు. రక్షణ రంగంలో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. పంచాయతీల్లోనూ మహిళ ప్రాధాన్యం పెరుగుతోందని స్పీకర్‌ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక ప్రగతితోపాటు సుపరిపాలన, సామాజిక పురోగతి ఆవశ్యకమన్నారు. రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *